సాధారణంగా స్టార్ హీరోలు, దర్శకులు ఎల్లప్పుడూ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు.ఒక సినిమాను పూర్తి చేయగానే గ్యాప్ లేకుండా మరో ప్రాజెక్టును మొదలుపెట్టడం వారికి అనివార్యంగా మారుతుంటుంది.
అలాంటప్పుడు సొంత సినిమానే థియేటర్లలో చూసే ఛాన్స్ వారికి రాదు.ఇలా సొంత సినిమాలను థియేటర్‌లో చూడకుండా మిస్ అయిపోయిన వారు ఎందరో ఉన్నారు.
వారిలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పేరు ప్రధానంగా వినిపిస్తుంది.ఈ పవర్ స్టార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాల్లో చాలా వరకు తాను థియేటర్లలో చూడలేదని చెప్పాడు.
హీరోలు మాత్రమే కాదు స్టార్ రైటర్స్ కూడా తమ సొంత సినిమాలనే మిస్ అయిపోతుంటారు.ఉదాహరణకు మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) పేరు చెప్పుకోవచ్చు.
వంశీ కూడా ఏజెంట్ సినిమాకు( Agent Movie ) కథ అందించాడు.అయితే ఈ సినిమాని అతడు చూడకపోవడం గమనార్హం.ఈ మూవీ థియేటర్‌లో విడుదలైనప్పుడు వంశీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా డైరెక్ట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడట.అందుకే దీనిని చూడలేదని అతడు తెలిపాడు.
ఓటీటీలో అయినా చూద్దామని ఆశ పడ్డాడట కానీ అది ఇప్పటివరకు ఏ ప్లాట్‌ఫామ్ లో విడుదల కాలేదు.
శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా “లీడర్”( Leader Movie ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.అయితే శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) దీనిని థియేటర్‌లో చూడటం మిస్ అయ్యాడట.చాలా రోజుల తర్వాత టీవీలో ప్రసారమైనప్పుడు చూశానని అతను తెలిపాడు.
అయితే శేఖర్ కి థియేటర్‌లో చూసే వీలున్నా సరే అతను దీనిని కావాలని స్కిప్ చేశాడని అంటారు.ఎందుకంటే అప్పట్లో ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి.
అందువల్ల చూసి బాధపడటం ఎందుకని థియేటర్‌కు రాలేదని అంటారు.
పైన చెప్పిన విధంగా కొంతమంది బిజీగా ఉండటం వల్ల సొంత సినిమాలనే థియేటర్లో చూడటం మిస్ అవుతుంటారు.మరి కొంతమంది కావాలని స్కిప్ చేస్తుంటారు.ఏదేమైనా హీరోలు, దర్శన నిర్మాతలకు థియేటర్‌లో తమ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది.
కాకపోతే కొన్ని కారణాల వల్ల వారు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వదులుకుంటుంటారు.అయితే ఈ సినిమాలను ఎప్పటికైనా చూడాలని కోరిక వారికి ఎప్పటికీ ఉంటుంది.అది టీవీలో నైనా లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనైనా!
.