త్వరలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని వైసీపీ మ్యానిఫెస్టో రూపకల్పనపై దృష్టి సారించింది.ఈ మేరకు ఇప్పటికే మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ పూర్తయిందని తెలుస్తోంది.
ఈ మ్యానిఫెస్టో డ్రాఫ్ట్ ను సీఎం జగన్ పరిశీలించనున్నారు.పరిశీలన అనంతరం ఈ నెల 20వ తేదీన వైసీపీ అధినేత, సీఎం జగన్ మ్యానిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నవరత్నాల తరహాలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఈసారి మ్యానిఫెస్టో ఉండే అవకాశం ఉందని సమాచారం.ఇందులో నిరుద్యోగ యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.