Sharmila : వైసీపీ “సిద్ధం” సభలపై షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ ఎలక్షన్ షెడ్యూల్( AP Election Schedule ) విడుదల కావడం జరిగింది.దీంతో నేటి నుంచి ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.

 Sharmila : వైసీపీ “సిద్ధం” సభలపై �-TeluguStop.com

దీంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు.విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు.

నేటి నుంచి జూన్ 6 వరకు కోడ్ అమలులోకి ఉండనుంది.దీంతో ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచడం జరిగింది.

ఇదిలాఉండగా విశాఖపట్నంలో కాంగ్రెస్ “న్యాయ సాధన” సభ నిర్వహించింది.ఈ సభలో ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల( YS Sharmila ).వైసీపీ “సిద్ధం” సభలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.“సిద్ధం” సభలకు వైసీపీ.600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆరోపించారు.

ప్రత్యేక హోదాను, పోలవరాన్ని, వైజాగ్ స్టీల్( Vizag Steel ) ను కేంద్రం వద్ద తాకాటు పెట్టడానికి సిద్ధమా.? పూర్తి మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా.? దేనికి సిద్ధం జగనన్న.? ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైయస్సార్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖపట్నంలో జరిగిన ఈ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది.రెండు వామపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ న్యాయసాధన సభలో పాల్గొనడం జరిగింది.

విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన ఈ సభకు భారీ ఎత్తున జనం రావటంతో సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube