చరణ్, ఉపాసనల( Charan, Upasana ) గారాల పట్టి క్లీంకార( Klinkara ) ఫోటోలను అఫీషియల్ గా ఇప్పటివరకు రివీల్ చేయలేదు.ఫోటోలను ఎప్పుడు రివీల్ చేస్తారనే ప్రశ్నలకు సైతం జవాబులు దొరకడం లేదు.
అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో క్లీంకార ఫోటోలు తీశారని ఆ ఫోటోలు ఇవేనంటూ కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు క్లీంకార పిక్స్ చూసి క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే గతంలో కూడా కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ కాగా తర్వాత రోజుల్లో ఆ ఫోటోలలో ఉన్నది క్లీంకార కాదని క్లారిటీ వచ్చింది.ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోల విషయంలో మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఉపాసన, చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.అయోధ్యలో అపోలో ఆస్పత్రి నిర్మాణం( Apollo Hospital in Ayodhya ) దిశగా ఉపాసన అడుగులు వేస్తున్నారు.
బిజినెస్ పరంగా ఆమె అంతకంతకూ ఎదుగుతున్నారు.
చరణ్ ఉపాసన త్వరలో మరో శుభవార్త చెప్పాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మెగా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత మెగా హీరోలకు మరింత కలిసొచ్చిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామ్ చరణ్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉండగా గ్లోబల్ హీరోగా రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.
క్లీంకార పేరు మీద ఇప్పటికే ఒక పాట కూడా విడుదలైంది.
క్లీంకార జాతకం అద్భుతంగా ఉందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు.మరికొన్ని నెలల తర్వాత క్లీంకార ఫస్ట్ పుట్టినరోజు వేడుకలు జరగనుండగా ఈ వేడుకలను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది.క్లీంకార ఫోటోలను అధికారికంగా రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఆ ఫోటోలను రాబోయే రోజుల్లో రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది.