ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ( MP Magunta Srinivasula Reddy )టీడీపీలోకి చేరనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఈ నెల చివరిలో లేదా మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీ( TDP ) కండువా కప్పుకోనున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే రెండు లేదా మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.తన కుమారుడు రాఘవ రెడ్డిని( Raghava Reddy ) ఒంగోలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని మాగుంట యోచనలో ఉన్నారు.మరోవైపు మాగుంట చేరికకు టీడీపీ అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.మాగుంట టీడీపీలో చేరితే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీ బలం మరింత పెరిగే అవకాశం ఉంది.