తూర్పు గోదావరి జిల్లా( East Godavari District ) గోపాలపురం మండలం నందిగూడెంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.పెద్దపులి పాదముద్రలను గుర్తించిన స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
గోపాలపురం మండలం కరకపాడు అటవీ ప్రాంతంలో పెద్దపులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు( Forest officials ) అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే నిన్న సాయంత్రం మాతంగి మెట్ట ప్రాంతంలో సంచరించిన పులి ఇవాళ నందిగూడెంలో సంచరిస్తుంది. పెద్దపులి( Tiger ) సంచారం నేపథ్యంలో స్థానిక ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మరోవైపు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పెద్దపులి జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.