Zeenat Priya Munish Raja : తండ్రి మాట కాదని బుల్లితెర నటుడిని పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు ఏం జరిగిందంటే?

కోలీవుడ్( Kollywood ) కి చెందిన ఒక నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఒక యువతి.తండ్రిని ఎదిరించి మరీ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది.

 Tamil Actor Rajkiran Daughter Zeenat Priya Separates Munish Raja-TeluguStop.com

కానీ తాజాగా అతనికి విడాకులు ఇచ్చినట్లు ప్రకటిస్తూ ఒకసారి గా షాక్ ఇచ్చింది.ఇంతకీ ఆమె ఎవరు ఆ నటుడు ఎవరు అన్న విషయానికి వస్తే.

బుల్లితెర నటుడు మునీశ్ రాజా( Munish Raja )ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె విడిపోయినట్లు ఒక వీడియోను రిలీజ్‌ చేసింది.జీనత్ ప్రియ అనే ఆమె బుల్లితెర నటుడు మునీష్ రాజను ప్రేమించి పెళ్లి( Love Marriage ) చేసుకుంది.

కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమె తాజాగా తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటిస్తూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

Telugu Rajkiran, Munish Raja, Zeenat Priya-Movie

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని కూడా విడుదల చేసింది.ఆ వీడియోలో జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.అందరికీ నమస్కారం.

నేను జీనత్ ప్రియ.రాజ్‌కిరణ్( Raj Kiran ) సార్ దత్తపుత్రికను.2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నాను.కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాము.

మేం విడిపోయి కూడా కొన్ని నెలలు అయ్యింది.మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు.

ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను.నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను.

అయినప్పటికీ.నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు.

నాకు సహాయం చేశారు.ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

కాగా ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Telugu Rajkiran, Munish Raja, Zeenat Priya-Movie

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్( Zeenat Priya,Munish Raja ) మొదట స్నేహితులుగా ఉన్నారు.ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది.ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు.

అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది.కానీ రాజ్‌కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.

మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్‌కుమార్ అన్నారు.దీంతో రాజ్‌కుమార్‌ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్‌కిరణ్‌పై పలు ఆరోపణలు చేసింది.తాజాగా భర్తతో విడాకులు( Divorce ) తీసుకున్నట్లు వీడియో రిలీజ్‌ చేసి అందరికీ ఒక్క సారిగా షాక్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube