అనుకున్న సమయానికి రాబోతున్న పుష్పరాజ్.. మొదలైన కౌంట్ డౌన్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa ) లో నటించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 Pushpa Team Gives Clarity About Pushpa 2 Release Date, Pushpa 2, Allu Arjun, Suk-TeluguStop.com

ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన పుష్ప సినిమాలోని తన నటనతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు.

ఇలా ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై మరింత బాధ్యతలు పెరిగాయి.దీంతో పుష్ప 2( Pushpa 2 )సినిమా పట్ల ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ సినిమాలో కేశవ పాత్ర( Keshava )లో నటించిన నటుడు అరెస్టు కావడంతో సినిమా వాయిదా పడుతుంది అంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలపై తాజాగా చిత్ర బృందం స్పందించే క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బన్నీ డిజిటల్ టీం ఈ వార్తలపై స్పందిస్తూ.అనుకున్న సమయానికే పుష్పరాజ్‌ ర్యాంపేజ్‌( Pushparaj Rampage ) ఖాయం అని ట్వీట్‌ చేశారు.

 ఇక ఈ సినిమా విడుదలపై సుకుమార్ కూడా స్పందిస్తూ.ఇంకా 200 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్స్‌ ప్రారంభం కానున్నాయంటూ ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్స్ వరల్డ్ గా మారడంతో పుష్పరాజ్ ఆగమనం మొదలైంది అంటూ అభిమానులు కౌంట్  డౌన్ మొదలుపెట్టారు.

మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube