విజయవాడలో ఇవాళ ఏపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ( AP Congress Manifesto Committee ) భేటీ జరగనుంది.ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుంది.
మాజీ ఎంపీ పళ్లం రాజు ఛైర్మన్ గా సుమారు పదకొండు మందితో ఏఐసీసీ మ్యానిఫెస్టో కమిటీని నియమించింది.కాగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో జరిగే ఈ మ్యానిఫెస్టో కమిటీ సమావేశానికి పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఇప్పటికే జిల్లాల పర్యటనను ముగించిన పీసీసీ చీఫ్ షర్మిల ప్రస్తుతం ఎన్నికల మ్యానిఫెస్టోపై ఫోకస్ పెట్టారు.ఇందులో భాగంగానే ఇవాళ మ్యానిఫెస్టో కమిటీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.