భారత వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.భారత జట్టు ఓవర్ నైట్ స్కోరు 421/7 తో మూడో రోజు ఆట ప్రారంభించి మరో 15 పరుగులు మాత్రమే చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది.దీంతో రవీంద్ర జడేజా త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.87 పరుగులు చేసిన జడేజా( Ravindra Jadeja ) ఎల్బీడబ్ల్యుగా అవుట్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తొలి బంతికే జో రూట్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాత ఓవర్లో చివరి బంతికి అక్షర పటేల్ అవుట్ అవ్వడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ కు తెరపడింది.ఇంగ్లాండ్ బౌలర్ జో రూట్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 121 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 436 పరుగులు చేసింది.భారత జట్టు బ్యాటర్లైన రవీంద్ర జడేజా (87), కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) పరుగులతో అద్భుతంగా రాణించారు.ఇంగ్లాండ్ బౌలర్ జో రూట్ ( Joe Root )భారత జట్టు బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టాడు.
మిగతా ఇంగ్లాండ్ బౌలర్లైన టామ్ హర్ట్లి, రెహన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, జాక్ లీచ్ ఒక వికెట్ తీసుకున్నాడు.ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసి 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లను, భారత బౌలర్లు పూర్తిస్థాయిలో కట్టడి చేస్తే.
భారత్ సులభంగా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది.