సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ శోభాశెట్టి.. అలా చాలాసార్లు మోసపోయామంటూ?

కార్తీకదీపం సీరియల్( Karthika Deepam Serial ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న శోభాశెట్టి బిగ్ బాస్ షో ద్వారా అంతకు మించి పాపులారిటీని పెంచుకున్నారు.శోభాశెట్టి తాజాగా సొంతింటి కలను నెరవేర్చుకోగా ఆ విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

 Shobha Shetty Comments About Dream Home Details Here Goes Viral In Social Media-TeluguStop.com

బిగ్ బాస్ షో( Bigg Boss Show ) వల్ల విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొన్న శోభాశెట్టి రామ మందిర ప్రారంభోత్సవం రోజున కొత్తింటి తాళం నా చేతికి వచ్చిందని అన్నారు.రెండు సంవత్సరాల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ చూశామని ఆ అపార్టుమెంట్ నచ్చడంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆమె అన్నారు.

అయితే కొన్ని రీజన్ల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయిందని శోభాశెట్టి చెప్పుకొచ్చారు.ఆ సమయంలో మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదని ఆమె అన్నారు.అలా చాలాసార్లు మోసపోయామని ఆ సమయంలో ఇల్లు కొంటానా? లేదా? అని టెన్షన్ పడ్డానని శోభాశెట్టి అన్నారు.చివరకు సొంతింటే కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నానని ఆమె వెల్లడించారు.

బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదని రెండేళ్ల క్రితమే ఈ ఇంటిని కొనుగోలు చేశానని శోభాశెట్టి( Shobha Shetty ) వెల్లడించారు.అయితే ఇంటి తాళం మాత్రం నా చేతికి ఆలస్యంగా వచ్చిందని ఆమె అన్నారు.

ప్రస్తుతం 15వ అంతస్తులో ఉన్న ఉన్న ఫ్లాట్ తీసుకున్నామని ఇంటీరియర్ డిజైనింగ్ కు మరో నాలుగు నెలల సమయం పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్ అవుతామని శోభాశెట్టి పేర్కొన్నారు.శోభాశెట్టి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social Media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.తెలుగులో మరిన్ని సీరియల్స్ తో శోభాశెట్టి బిజీ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

శోభాశెట్టి రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.శోభాశెట్టి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube