వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ క్రమంలోనే త్వరలోనే షర్మిల జిల్లాల పర్యటనకు కార్యాచరణ రూపొందుతుందని తెలుస్తోంది.
ఈ నెల 23వ తేదీన ఏపీ పీసీసీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ప్రధానంగా షర్మిల జిల్లాల పర్యటనతో పాటు ఎన్నికల రోడ్ మ్యాప్ పై చర్చింనున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల భావిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు పార్టీలో చేరికలపై షర్మిల ప్రత్యేక ఫోకస్ పెట్టగా కాంగ్రెస్ యంత్రాంగం లిస్టును సిద్ధం చేసింది.