ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.అయితే రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోకపోవడంతో ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదనే మహేష్ బాబు చాలా ఆశలు పెట్టుకున్నారు.కాబట్టి దానికి ఒక్కసారిగా వరల్డ్ లోనే మంచి గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది.
ఇక ఈ సినిమాతో రాజమౌళి( Rajamouli ) ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా చేసి సూపర్ సక్సెస్ కొట్టబోతున్నాడు అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు.నిజానికి ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు మహేష్ బాబు( Mahesh Babu ) పాన్ ఇండియా లోనే సినిమా చేయలేదు.డైరెక్ట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మహేష్ బాబు జక్కన్న దర్శకత్వంలో మొదటి సారి చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీగా కష్టపడి పోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయమని రాజమౌళి చెప్పినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి.
వన్ సినిమాతో సిక్స్ ప్యాక్ ని ట్రై చేసిన మహేష్ బాబు ఆ సినిమాలో సిక్స్ ప్యాక్ సెట్ అవ్వలేదని మళ్ళీ ట్రై చేయలేదు.ఇక ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికి అయితే మహేష్ బాబు ఒక్కసారిగా పాన్ వరల్డ్ హీరోగా క్రేజ్ సంపాదించుకోబోతున్నాడని తెలుస్తుంది…
.