జనవరి 10న హీరో హృతిక్ రోషన్( Hero Hrithik Roshan ) తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు.ఈ సందర్బంగా హృతిక్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్( Hrithik Roshan Birthday Celebrations ) ను గ్రాండ్ గా చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు హైదరాబాద్ లో విజయవాడలో మరియు వైజాగ్ లో ఉన్న కొన్ని అనాదాశ్రమలలో ఫుడ్ డొనేట్ చేశారు.అలాగే మంగళగిరి వైజాగ్ లో మొక్కలు నాటడం జరిగింది.చెన్నై సిటీ( Chennai )లో అలాగే హైదరాబాద్ , విజయవాడ సిటీలో కేక్ కటింగ్ చేశారు.
చెన్నై సిటీలో ట్రక్ లో ఫుడ్ ను డిస్ట్రిబ్యూషన్ చేశారు అలాగే కొంతమంది ఫాన్స్ హృతిక్ రోషన్ హిట్ సాంగ్స్ కు డాన్స్ చేశారు.తమ అభిమాన హీరో సినిమా ఫైటర్ జనవరి 25న విడుదల అవుతున్న సందర్బంగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని హృతిక్ రోషన్ ఫాన్స్ కోరుకున్నారు.