ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కలెక్టర్ కార్యాలయం ఉన్న బందరు రోడ్డులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్మిక సంఘాల నేతలను అడ్డుకున్నారు.అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు.
దీంతో విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అయితే తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.