Chandrasekhar: టీవీ, యూట్యూబ్ యాడ్స్‌లో మెరుస్తున్న చంద్రశేఖర్.. ఈయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఈ రోజుల్లో ఎంత నాణ్యమైన ప్రోడక్ట్ తయారు చేసినా సరే దానికి తగిన ప్రచారం లేకపోతే సేల్స్ జరగవు.అందుకే కంపెనీలు తమ ప్రొడక్ట్ ప్రచారాల కోసం చాలా డబ్బులు ఇచ్చేస్తుంటాయి.

 Do You Know About This Person Swarga Seema Md Chandra Chandrasekhar-TeluguStop.com

ప్రకటనలు తయారు చేయించి మరీ వాటిని టీవీలు, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తుంటాయి.సినిమా సెలబ్రిటీలే కాకుండా ఈ ప్రకటనల వల్ల చాలామంది ఆర్టిస్టులు ( Artists ) ఉపాధి పొందుతున్నారు.

అయితే ఒక్కో యాడ్‌కి వేర్వేరు ఆర్టిస్టులు కనిపిస్తూ ఉంటారు కానీ ఒక ఆర్టిస్టు మాత్రం తరచుగా అనేక టీవీ యాడ్స్ లో కనిపిస్తుంటారు.

నిజానికి అతను ఆర్టిస్ట్ కాదు, అతనొక మామూలు వ్యక్తి అని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు.

పై ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ ఫేస్ ను మీరు ఒక్కసారైనా టీవీ యాడ్స్ లో( TV Ads ) చూసే ఉంటారు.ఆయన పేరు చండ్ర చంద్రశేఖర్‌.

( Chandra Chandrasekhar ) స్వర్గసీమ హౌసింగ్‌ కంపెనీకి ఇతను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.స్వర్గసీమ బ్రాండ్‌ ప్రమోషన్ల వీడియోలు, ఫోటోలలో ఆయన దాదాపు కనిపిస్తుంటారు.

Telugu Ambassador, Kiran Kumar, Swarga Seema, Swargaseema, Swarga Seema Md, Tv-L

ఆ కంపెనీకి చంద్రశేఖర్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా( Brand Ambassador ) కొనసాగుతున్నారు.సొంత సర్వీస్ లను ఆయనే స్వయంగా ప్రమోట్ చేసుకుంటూ తెలుగు ప్రజలకు చాలా సుపరిచితులయ్యారు.పౌరాణిక, రాజుల వేషాలలో ప్రకటనలు చేసి చాలామంది దృష్టిని కూడా ఆకట్టుకున్నారు.నిజంగా ఈయన క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పుకున్నా తక్కువే.డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్( Kiran Kumar ) లాగానే తెలుగు రాష్ట్రాల్లో చంద్రశేఖర్‌ కూడా పాపులర్ అయ్యారు.చంద్రశేఖర్‌ రెండు దశాబ్దాలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం( Real Estate ) చేస్తున్నారు.

కన్‌స్ట్రక్షన్‌, ఓపెన్‌ ప్లాట్‌ సేల్స్‌లో ఎంతో ఎక్స్‌పీరియన్స్ సంపాదించిన ఈ వ్యాపారి ఒక సక్సెస్‌ ఫుల్‌ బిల్డర్‌గానూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.

Telugu Ambassador, Kiran Kumar, Swarga Seema, Swargaseema, Swarga Seema Md, Tv-L

దాదాపు ఆరేళ్ల క్రితం స్వర్గసీమ ( Swarga Seema ) ఎండీగా పగ్గాలు చేపట్టిన చంద్రశేఖర్ కేవలం బిల్డర్‌గానే కాకుండా కౌన్సిలర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రజలకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంతో ‘చండ్ర చంద్రశేఖర్‌’ పేరిట ఒక యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా స్టార్ట్ చేశారు.ఈ ఛానల్‌కు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఏది ఏమైనా తన కంపెనీకి చెందిన ప్రకటనలో తానే కనిపించాలని ఇతడు చేసిన ఆలోచన నిజంగా ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు.ఎందుకంటే స్వయంగా ఆయనే చెబుతున్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకునే వారికి నమ్మకం ఉంటుంది.

విశ్వసనీయత అనేది చూసేవారిలో ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube