ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజురోజుకీ పరిస్థితి మారిపోతున్నాయి.సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా వరకు మనిషి ఆన్ లైన్ లోనే బతుకుతున్నాడు.వాస్తవ జీవితంలో విలువలను కోల్పోతున్నాడు.
ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కానీ మరోపక్క మూఢనమ్మకాలు మాత్రం మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి.విజ్ఞానం, చదువు లేని ప్రాంతాలలో ఈ మూఢనమ్మకాలు ( Superstitions ) రాజ్యమేలుతున్నాయి.
దీంతో చాలామంది స్త్రీలు మరియు పిల్లలు అనేక ఇబ్బందులు పాలవుతున్నారు.ఈ రకంగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో( Madhya Pradesh ) ఓ చిన్నారి మృతి చెందడం జరిగింది.
వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన మూఢనమ్మకాలు ప్రజలను వదలటం లేదు.తాజాగా మధ్యప్రదేశ్ షాష్ దోష్ జిల్లాలో ఒకటిన్నర నెల వయసు ఉన్న శిశువు శ్వాసకోస వ్యాధితో( Respiratory Disease ) బాధపడుతూ ఉంది.దీంతో కుటుంబ సభ్యులు ఆ వ్యాధి విరుగుడుకు ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్ తో ( Hot Iron Rod ) శిశువు శరీరంపై వాతలు పెట్టారు.దీంతో చిన్నారి ప్రాణం మరింతగా క్షిణించింది.
వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శిశువు మరణించడం జరిగింది.శిశువు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇదే సమయంలో శరీరంపై వాతలు ఉండటంతో వైద్యులు విషయం మొత్తం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి.