ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.ఎప్పటి నుంచో జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తుంది .
అయితే ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి పెద్దగా కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు.ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ఇక కొంతకాలం క్రితమే టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకుంది.ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
సీట్ల సర్దుబాటు వ్యవహారమూ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఇది ఇలా ఉండగానే .బిజెపి, టిడిపికి( BJP, TDP ) పొత్తు సంకేతాలు పంపించినట్లు సమాచారం.అయితే టీడీపీ ( TDP )నుంచి సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ పొత్తు వ్యవహారం పై బహిరంగంగా స్పందించాలని బిజెపి నిర్ణయించుకుంది .తెలంగాణలో బిజెపి, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి .
అదేవిధంగా ఏపీ ఎన్నికల్లోను జనసేన ,టిడిపి ,బిజెపిలు కలిసి పోటీ చేస్తే మంచిదనే అభిప్రాయానికి బిజెపి నేతలు వచ్చినట్లు సమాచారం.అయితే ఏదైనా రాష్ట్రాల్లో పొత్తులు, రాజకీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం లో వాటిపై చర్చించడం బిజెపిలో ఆనవాయితీగా వస్తుంది.దీంతో జనవరి మొదటి వారంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి , ఏపీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో ఒక క్లారిటీ కి రావాలని బిజెపి అగ్ర నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.అంతకంటే ముందుగానే ఈ పొత్తుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని విషయంపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను కూడా సేకరించినట్లు సమాచారం.
అయితే పొత్తులో భాగంగా 8 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాల్సిందిగా కోరుతుండగా, టిడిపి మాత్రం బిజెపికి 5 ఎంపీ, 5 ఎమ్మెల్యే సీట్ల ను ఇచ్చేందుకు సిద్దమనే విషయాన్ని తెలియజేసిందట.ఈ సీట్లను తీసుకునేందుకు అంగీకరిస్తే పొత్తు కు తామూ సిద్దం గానే ఉన్నట్టుగా టీడీపీ వర్తమానం పంపిందట.పార్టీ కమిటీ ఇచ్చిన నివేదికపై జనవరి తొలి వారంలో జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.టిడిపి తో పొత్తు విషయంలో ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) నుంచి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకుని , బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించేందుకు బిజెపి సిద్దమవుతుంది.
అయితే సీట్ల విషయంలో తాము కోరినన్ని స్థానాలను పొత్తులో భాగంగా ఇవ్వాల్సిందే అన్న పట్టుదల తో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం.