తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ఇండస్ట్రీలో తమదైన ముద్రను వేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఇక ఇప్పటికే రవితేజ లాంటి స్టార్ హీరో వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.
ఇంతకుముందు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao ) భారీ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఆయన ఈగల్ సినిమాతో ( Eagle Movi )సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.ఈ ట్రైలర్ అధ్యంతం ఆసక్తిని రేకెత్తిస్తు సూపర్ గా ఉండటమే కాకుండా రవితేజ అభిమానులను కూడా విపరీతంగా అలరిస్తుంది.అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి విజయాన్ని సాధిస్తుందని రవితేజ అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు డైరెక్టర్ గా కార్తీక్ ఘట్టమనేని వ్యవహరిస్తున్నాడు.ఇక ఈయన ఇంతకుముందు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేశాడు.
ఈ సినిమా పెద్దగా ఆకట్టుకొనప్పటికీ డైరెక్టర్ గా అతనికి మంచి పేరు వచ్చింది.ఇక దాంతో రవితేజతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈయన ఈగల్ అనే కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన హిట్ కొడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఒకవేళ ఈ సినిమాతో రవితేజ మంచి సక్సెస్ ని సాధిస్తే రవితేజకు భారీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంది అలాగే మార్కెట్ పరంగా కూడా రవితేజ కి విపరీతంగా మార్కెట్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని కి కూడా మంచి అవకాశాలు వస్తాయి.ఇక ఈ సినిమా మీదనే ఇద్దరి భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది.కాబట్టి ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఇద్దరి లైఫ్ లు ఒకే రకంగా సెట్ అవుతాయి అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.