యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్( Salaar ) మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.కేజీఎఫ్ సిరీస్ లాంటి సంచలనాత్మక సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో ఉండాలో , అంతకు మించే ఈ చిత్రం ఉందని రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ ని చూస్తే ఈ విషయం అర్థం అయ్యింది.
నిన్న రాత్రి ఈ చిత్రానికి సంబదనించిన అడ్వాన్స్ బూక్న్గ్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు.ఊహించిన విధంగానే బుక్ మై షో యాప్ కూడా క్రాష్ అయ్యే విధమైన రెస్పాన్స్ వచ్చింది.
గంటకి 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్న ఈ సినిమాకి గడిచిన 24 గంటల్లో నాలుగు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ అదిరిపోతాయి కానీ, ఇతర భాషల్లో అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ వచ్చేలా లేదు.ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం లో ప్రభాస్ ( Prabhas’ )తో సమానమైన క్యారక్టర్ ని ఆయన పోషించాడు.
డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ నా కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని పృథ్వీ రాజ్ ఈ సందర్భంగా చెప్పాడు.నిజంగా రెండు ట్రైలర్స్ మరియు సూరీడు పాట ని చూసిన తర్వాత పృథ్వి రాజ్ కి అద్భుతమైన క్యారక్టర్ పడినట్టు అనిపించింది.
ఈ పాత్ర ఎవరో మలయాళం హీరో చేసే బదులు మన తెలుగు లోనే ఎవరైనా మీడియం రేంజ్ హీరో తో చేయిస్తే బాగుండేది కదా అనే అభిప్రాయం ఉండేది.
మనకి వచ్చిన ఈ ఆలోచన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి రాకుండా ఎందుకు ఉండి ఉంటుంది, కచ్చితంగా వచ్చింది.ఈ పాత్రని తొలుత ఆయన మ్యాచో స్టార్ గోపీచంద్ తో చేయించాలని అనుకున్నాడట.గోపీచంద్ ప్రభాస్ కి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.
వీళ్లిద్దరు గతం లో ‘వర్షం( Varsham )’ అనే చిత్రం లో నటించారు.ఇందులో ప్రభాస్ హీరో గా నటించగా, గోపీచంద్( Gopichand ) విలన్ గా నటించాడు.
అప్పుడు ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగింది.ఇది ఇలా ఉండగా ప్రశాంత్ నీల్ అడగగానే గోపీచంద్ చెయ్యడానికి సిద్ధం ఉన్నప్పటికీ ప్రభాస్ ఒప్పుకోలేదట.
ఎందుకంటే హీరో గా కొనసాగుతున్నావు, ఇలాంటి సమయం లో ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ లో అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి, వద్దు అని ఆపించేసాడట.దీంతో ఆ పాత్ర పృథ్వీ రాజ్ చెయ్యాల్సి వచ్చింది.