యూత్ స్టార్ నితిన్ ( Nithiin ) వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.అయినా తన కెరీర్ కి ఎన్ని ప్లాప్స్ వస్తున్నప్పటికీ ఈయన లైనప్ లో మాత్రం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
మరి ఇటీవలే నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్(‘Extra-Ordinary Man )” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.
మరి ప్రజెంట్ నితిన్ చేస్తున్న ప్రాజెక్టుల్లో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఒకటి.ఛలో, భీష్మ వంటి రెండు సూపర్ హిట్స్ ను అందుకుని ఫేమస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో నితిన్ మరో ప్రాజెక్ట్ కోసం చేయి కలిపాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.ఇక వెంకీ ఈసారి కూడా కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ను సిద్ధం చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.కాగా ఈ సినిమాలో సీనియర్ హీరో అర్జున్ సర్జా ( Arjun Sarja ) నటించబోతున్నట్టు తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈయన రోల్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని ఈ రోల్ ను వెంకీ చాలా స్పెషల్ గా సిద్ధం చేసినట్టు టాక్.కామెడీ, లవ్ ట్రాక్ తో పాటు యాక్షన్ కూడా సమపాళ్లలో ఉండేలా వెంకీ తెరకెక్కిస్తున్నాడట.చూడాలి మరి ఈ మూవీ నితిన్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో.ఈ సినిమాలో ముందుగా నితిన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు.
కానీ ఈ భామ బిజీ షెడ్యూల్ కారణంగా ఈమె ఈ సినిమా నుండి తప్పుకుంది.దీంతో ఈ సినిమాలో శ్రీలీలను ( Sreeleela ) ఫైనల్ చేసారు.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.