లెఫ్ట్‌సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్..

రోడ్లపై ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.అంతేకాకుండా ట్రాఫిక్ రూల్స్ ( Traffic Rules )తప్పక పాటించాలి.

 Fatal Accident While Overtaking From Left Side Shocking Video Viral , Viral News-TeluguStop.com

లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.వాహనదారులకు ఈ విషయం తెలిసినా తొందరగా ఇంటికి చేరుకోవాలనే తపనతో చాలా ఫాస్ట్ గా ఎలా పడితే అలా రోడ్లపై వెళ్తుంటారు.

ఇలాంటి తీరు వల్లే రోడ్లపై యాక్సిడెంట్ జరుగుతుంటాయి.తాజాగా ఒక బైకర్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి బస్సును ఓవర్టేక్ చేద్దామనుకున్నాడు, అది కూడా ఒక టర్నింగ్ లో.ఈ తప్పు చేయడం వల్ల అతడు ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి.అదృష్టవశాత్తు అతడు కొద్దిలో తప్పించుకోగలిగాడు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక బస్సు ఒక మాదిరి వేగంతో వెళుతూ కనిపిస్తుంది.అది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ( Left side indicator )కూడా ఆన్ చేసింది.అయితే ఆ ఇండికేటర్ ని పట్టించుకోకుండా ఒక బైకర్ చాలా ఫాస్ట్ గా వచ్చాడు.

అతడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్లిపోదామని చూశాడు.అంతలోనే బస్సు లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంది.

దాంతో బైకర్ బస్సును ఢీ కొట్టాడు.ఆపై బైక్ బస్సు టైర్ కింద పడింది.

అతడేమో ముందు చక్రాల కిందపడ్డాడు.బస్సు ముందు చక్రం అతడి పైనుంచి వెళ్ళింది.

వెనక చక్రాలు బండిని తోక్కేసాయి.అదృష్టవశాత్తు అతడు ఆ ప్రమాదం నుంచి వెంటనే లేవగలిగాడు.

బహుశా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అతడి తలకు పెద్దగా గాయాలైనట్లు లేదు.అందువల్ల ఈ ప్రమాదం నుంచి బాగానే తప్పించుకోగలిగాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎడమ వైపు నుంచి ఎప్పుడూ ఓవర్‌టేక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఈ రోడ్ యాక్సిడెంట్ వీడియోను బైక్‌సికెనెపాల్ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ పంచుకుంది.దీనికి ఇప్పటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube