ఈ సీజన్ బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లో లేడీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మగవాళ్ళతో సమానంగా పోటీ పడి ఆడిన కంటెస్టెంట్ ప్రియాంక జైన్.( Priyanka Jain ) ‘జానకి కలగనలేదు’, ‘మౌన రాగం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఆమె పై ఆడియన్స్ లో చాలా ఫోకస్ పడింది అనే విషయం అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా కుర్రకారులు ఆమె క్యూట్ ఫేస్ కి ఫిదా అయిపోయారు.అలాగే గేమ్ అద్భుతంగా ఆడింది కూడా.
ఆమె ఆ రేంజ్ లో ఆడుతుంది అని ఎవ్వరూ ఊహించలేకపోయారు.టాస్కులు ఆడడం లో ఎంత వరకు తన కృషి పెట్టాలో పెట్టి, ఎంత వరకు మర్యాదగా మాట్లాడాలో అంత మర్యాదగా మాట్లాడడం, తెలివిగా వ్యవహరించడం ఈమెలో ఉన్న ప్రత్యేకతలు, అందుకే టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది.
ఇకపోతే ఈమెకి శివ్( Shiv ) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఫ్యామిలీ వీక్ లో ఈయన హౌస్ లోకి అడుగుపెట్టి కంటెస్టెంట్స్ అందరినీ ఎంత చక్కగా పలకరించాడో మనమంతా చూసాము.హౌస్ లో ఉన్నప్పుడు ప్రియాంక ‘నేను బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం’ అని అంటుంది.వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంది అనే విషయం అందరికీ అర్థం అయ్యేలా చేసింది.
కానీ శివ్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మీ పెళ్లి( Marriage ) ఎప్పుడు అని అని యాంకర్ అడగగా ‘ఇంకా ఏమి అనుకోలేదు, ముందు ప్రియాంక బయటకి రానివ్వండి, అప్పుడు చూద్దాం’ అని అన్నాడు.అదేంటి మీరు వచ్చినప్పుడు బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం అని ప్రియాంక గారు అన్నారు కదా అని అడగగా, శివ్ నుండి ఆశించిన సమాధానం అయితే రాదు.
మేము క్లోజ్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పుకొచ్చాడు.
ఇంకా అయన ప్రియాంక గురించి మాట్లాడుతూ ‘ప్రియాంక చాలా కస్టపడి పైకి వచ్చింది.ఆమెడి చాలా పేద కుటుంబం.( Poor Family ) ఆమె తండ్రికి చిన్న షాప్ ఉంది.
నెలకి కేవలం పది వేల రూపాయిలు మాత్రమే వస్తాయి.ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు, కానీ ప్రియాంక వాళ్ళ నాన్న గారిని ఆయన స్నేహితుడు మోసం చెయ్యడం వల్ల ఒక్కసారిగా ఈ స్థితికి వచ్చేసారు.
అప్పటి నుండి ఇంటి బాధ్యతలు మొత్తం ప్రియాంకానే చూసుకుంటుంది.ఇప్పటికీ ఆమె డబ్బులు పంపిస్తే కానీ వాళ్ళ ఇల్లు గడవడు’ అంటూ చెప్పుకొచ్చాడు.