హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు.
అనంతరం పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు వీ.హనుమంతరావు మాట్లాడుతూ ముందుగా సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.గత పదేళ్లలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
అయితే తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీ అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని వీహెచ్ స్పష్టం చేశారు.