డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూల వేసి నివాళులు అర్పించిన పసుల వెంకటి

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత రాజ్యాంగ రూపకర్త,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపేరగని కృషి చేసిన మహానుభావుడు డా.బి అర్ అంబెడ్కర్ ( Dr BR Ambedkar )గారి 67 వ వర్ధంతి సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికికాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 Pasula Venkati Paid Floral Tributes To The Statue Of Dr. Br Ambedkar , Dr Br Am-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దేశానికి దశ దిశ నిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా ప్రతి ఒక్కరు ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానంగా ఎదగాలనిఅన్నారు.

బాబాసాహెబ్’గా ప్రసిద్ధి పొందిన భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ డిసెంబరు 6, 1956లో కన్నుమూశారని ఆయన వర్దంతిని ఏటా ‘మహాపరినిర్వాన్ దివస్( Mahaparinirvan Diwas )’గా జరుపుకుంటున్నాం దేశంలోని అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక సాధికారికతకు అంబేడ్కర్ చివరి వరకూ పోరాటం చేశారని బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురయి.పేదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని అంబేడ్కర్ తన జీవితకాలం అణగారివర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు పాటుపడ్డారని రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.

ఆర్ అంబేద్కర్ ముందు చూపువల్లే నేడు మన దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని,అందువల్లే సమాజంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు మామిడి నరేష్ ( Naresh ), మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి జమాల్ , ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్ , ఫిషరీస్ మండల అధ్యక్షుడు జెట్టి మల్లేశం , ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు లింగం, రమేష్ , రామకృష్ణ , రవీందర్ రెడ్డి, బాబు, మధు కుమార్, ఎలుక పవన్, ఆనంద్, సింహాద్రి , శ్రీనివాస్, రాజు, శంకర్, బాబు, తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube