"ఠాణా దివస్" కార్యక్రమానికి విశేష స్పందన

“ఠాణా దివస్” కార్యక్రమాన్ని మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రారంభించి అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న భద్రత సమస్యలు, ఫిర్యాదులను పరిష్కారం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూతంగా చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 3:00 గంటల వరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుండి 53 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీచేశారు.

 Huge Response For Thana Divas Rajanna Siricilla Sp Akhil Mahajan Details, Thana-TeluguStop.com

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా వెళ్ళడానికి “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకపోవడం సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నరు.

భూ సమస్యలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేయాలని సూచించారు.సివిల్ సమస్యలకు సంబంధించి సమస్యలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పించడంతో పాటు రిటైర్ ఎమ్మార్వో, డిఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.భార్య భర్తల గోడవల్లో భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు జీవన భత్యం కొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీతో మాట్లాడి భర్తల నుండి ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దేశంలో తెలంగాణ పోలీస్ శాఖ అగ్రభాగంలో ఉన్నదని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిలో వినియోగించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

ప్రజలతో మమేకం అవుతూ సత్వర న్యాయం అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.పోలీసులు నిరంతరం బాధితుల పక్షాన నిలుస్తారని, బాధితులకు న్యాయం చేయడం పోలీసుల కర్తవ్యంలో ఒక భాగమేనని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను విన్నపాలు స్వీకరించి,వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం తగిన చర్యలు చేపడుతామని అన్నారు.

“ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెలలో మొదటి మంగళవారం ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను, గ్రామాల్లో నెలకొన్న భద్రత సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి ఓపికతో తమ ఫిర్యాదులను స్వీకరించడం సంతోషంగా ఉందని అర్జీదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు బన్సీలాల్, వెంకటేష్, ఎస్.ఐ లు నాగరాజు,రఫిక్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube