జగన్ కాదంటే ఏం చేస్తానో చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే 

వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో ఒకరు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( Alla Ramakrishna Reddy ).అంతేకాదు వైసిపి ప్రతిపక్షంలో ఉండగా గత టిడిపి( TDP ) ప్రభుత్వంలో అమరావతి వ్యవహారంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించుగా.

 Mla Rk Said What He Would Do If Not For Jagan , Ysrcp, Ap Cm Jagan, Ap Governmen-TeluguStop.com

మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి అనేక పిటిషన్లు వేసి కోర్టుల ద్వారా టిడిపి ప్రభుత్వం అమరావతి లో ముందుకు వెళ్లకుండా చేయగలిగారు .ఇక 2019 ఎన్నికల్లోను ఆర్కే టిడిపి అభ్యర్థి నారా లోకేష్( Nara Lokesh ) పై విజయం సాధించారు.

తొలి మంత్రివర్గ విస్తరణలోనే ఆర్కే కు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా , ఆ అవకాశం ఆయనకు దక్కలేదు.దీంతో చాలాకాలంగా రామకృష్ణారెడ్డి జగన్ కు దూరంగా ఉంటున్నారని , పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంత ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.నిన్న సీఎం జగన్ నిర్వహించిన సమీక్షకు ఆయన హాజరు కాకపోవడంతో జగన్ కు,రామకృష్ణారెడ్డికి మధ్య దూరం మరింత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్ ఆసక్తి చూపించడం లేదని,అందుకే వీరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతుండడంపై,  తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.

మంగళగిరి కి సంబంధించి ఏ నిర్ణయం అయినా జగన్ తీసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.తాను కట్టుబడి ఉంటానని రామకృష్ణారెడ్డి అన్నారు.వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ ఇవ్వకపోయినా, వైసిపి మంగళగిరి నియోజకవర్గంలో గెలుస్తుందని అన్నారు.

తన కుమారుడి శుభకార్యానికి సంబంధించిన పనుల్లో తాను బిజీగా ఉండడం వల్లనే నిన్నటి సమావేశానికి హాజరు కాలేదని ఆయన తెలిపారు.పార్టీకి తనకు మధ్య గ్యాప్ పెరిగింది అన్న ప్రచారాన్ని రామకృష్ణారెడ్డి ఖండించారు.

రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ తోనే ఉంటానని , జగన్ కాదంటే వ్యవసాయం చేసుకుంటాను అంటూ ఆర్కే క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube