తలనీలాలు పోగు చేసుకొనే హక్కు టెండర్ కాలపరిమితి 2023-2025 రెండు సంవత్సరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం తలనీలాల టెండర్ ప్రక్రియను బహిరంగ వేలం వేశారు.తలనీలాలు పొగుచేసుకొనే హక్కు ను బహిరంగ వేలం లో 11 మంది పాల్గొనగా కడప జిల్లా ప్రొద్దుటూరు వాస్తవ్యులు కే వి ఎంటర్ ప్రెజన్ ప్రోప్రయటర్ కే.
రామాంజనేయులు 16 కోట్ల,86 లక్షల,10 వెయిలు పాట పాడగా సీల్డ్ టెండర్ లో 7 గురు పాల్గొనిన వారిలో అనంతపురం జిల్లా హిందూపురం వాస్తవ్యులు సుమిత్ ఎంటర్ ప్రెజస్ ప్రోప్రయటర్ కే.నాగరాజు 19 కోట్ల,8వేల రూపాయలకు టెండర్ కైవసం చేసుకున్నారు.ఈ టెండర్ ప్రక్రియ లో ఈఓ కృష్ణ ప్రసాద్ ,దేవాదాయ శాఖ పరిశీలకుడు సత్యనారాయణ , ఏ ఈ ఓ సంకేపల్లి హరికిషన్, ప్రతాప నవీన్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, సిరిగిరి శ్రీరాములు, ఉద్యోగులు కూరగాయల శ్రీనివాస్, ఎం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







