న్యాచురల్ స్టార్ నాని( Nani ) పారితోషికం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నాని హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.తాజాగా జరిగిన హాయ్ నాన్న మూవీ ( Hi Nanna movie )ఈవెంట్ లో విజయ్, రష్మికల( Vijay ,Rashmika ) ప్రైవేట్ ఫోటో స్క్రీన్ పై కనిపించగా నానిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు.
అయితే నాని ఈ వివాదం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
విజయ్, రష్మికలకు నాని క్షమాపణలు చెప్పారు.
అది మాకు తెలియకుండా జరిగిందని నాని అన్నారు.ఒక ఈవెంట్ కోసం చాలామంది పని చేస్తుంటారని ఎవరు ఎందుకు చేశారనేది క్లారిటీ ఉండదని బహుశా ఎగ్జైట్మెంట్ తో ఆ ఫోటోను వేసి ఉండవచ్చని నాని చెప్పుకొచ్చారు.
విజయ్, రష్మిక మంచి స్నేహితులని వాళ్ల ఫోటోలను బహిరంగం చేయాలని ఎందుకు అనుకుంటామని నాని కామెంట్లు చేయడం గమనార్హం.
వాళ్ల ఫోటోలను బహిరంగం చేయాలని ఎందుకు అనుకుంటామని నాని వెల్లడించారు.ఆ సంఘటనల వల్ల బాధ పడిన వాళ్లకు క్షమాపణలు చెబుతున్నానని నాని వెల్లడించారు.ఆ ఫోటో పెట్టిన వ్యక్తిని ఇప్పుడు నిందించినా లాభం ఉండదని నాని కామెంట్లు చేశారు.
ఆ వ్యక్తి ఇప్పటికే తన ఉద్యోగం గురించి కంగారు పడుతూ ఉంటాడని నాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాని హాయ్ నాన్న సినిమాతో బాక్సాఫీస్( box office ) వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హాయ్ నాన్న ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.