వీడియో: మా తల్లే.. బంగాళదుంపలను డిష్‌వాషర్‌లో క్లీన్ చేసిన యువతి..

వంటగాళ్లు చాలా క్రియేటివ్‌గా ఉంటారు.ముఖ్యంగా మహిళలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలను చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.

 Video Ma Thalle The Young Lady Who Cleaned The Potatoes In The Dishwasher, Potat-TeluguStop.com

ఇందులో భాగంగా కొందరు విచిత్రమైన పద్ధతులను కూడా ఆశ్రయిస్తుంటారు.వంట ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నంలో, ఒక మహిళ బంగాళాదుంపలను శుభ్రం చేయడానికి ఒక వింత మెథడ్ ను ఆశ్రయించింది.

అయితే ఈ పద్ధతి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఈ క్లీనింగ్ మెథడ్‌కి సంబంధించిన వైరల్ వీడియోలో, మహిళ థాంక్స్ గివింగ్ ఫెస్టివల్( Woman’s Thanksgiving Festival ) కోసం పెద్ద మొత్తంలో బంగాళాదుంపలను శుభ్రం చేయడానికి తన టెక్నిక్ ప్రదర్శిస్తుంది.

బంగాళాదుంపలను( potato ) ఒక గిన్నెలో మాన్యువల్‌గా కడగడానికి బదులుగా, ఆమె వాటిని తన డిష్‌వాషర్‌లో ఉంచుతుంది.నాలుగు నిమిషాల పాటు శుభ్రం రిన్స్-ఓన్లీ సైకిల్( Rinse-only cycle ) నడుపుతుంది.

సాంప్రదాయ హ్యాండ్ వాషింగ్ కంటే ఈ పద్ధతి వేగంగా, సమర్థవంతమైనదని ఆమె పేర్కొంది.

కొంతమంది నెటిజన్లు ఈ యువతి పద్ధతి వినూత్నంగా వద్దని పేర్కొన్నారు.సమయాన్నిసేవ్ చేసుకోవచ్చని చెప్పారు.మరికొందరు దాని భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే డిష్‌వాషర్ డిటర్జెంట్‌ను ఉపయోగించకపోయినా, బంగాళాదుంపలను కలుషితం చేసే మునుపటి వాష్‌ల నుంచి అవశేషాలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్‌లో పబ్లిక్ అఫైర్స్ స్పెషలిస్ట్ మెరెడిత్ కారోథర్స్ బ్యాక్టీరియా( Meredith Carothers bacteria ) బదిలీకి సంబంధించిన ముప్పును హైలైట్ చేశారు.ఈ ఆందోళనలు ఉన్నా, సదరు యువతి తన పద్ధతికి కట్టుబడి ఉంది, పెద్ద పరిమాణంలో బంగాళాదుంపలను శుభ్రం చేయడానికి ఇది సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గం అని పేర్కొంది.ఆమె దీనిని ప్రయత్నించి, సమయాన్ని ఆదా చేసే ప్రయోజనాలను పొందాలంటూ ఇతరులను ప్రోత్సహిస్తుంది.

ఈ సాంప్రదాయేతర శుభ్రపరిచే పద్ధతిపై చర్చ కొనసాగుతోంది.కొందరు ఇది మంచి పద్ధతే అని పేర్కొనగా మరి కొందరు మాత్రం ఆరోగ్యానికి హాని కలగడం ఖాయమని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube