అమెరికాలో కోవిడ్ తర్వాత పుట్టిన పిల్లల ఆయుర్ధాయం పెరిగిందట .. అధ్యయనంలో సంచలన విషయాలు

అమెరికన్ల ఆయు:ప్రమాణాలపై బుధవారం ఆసక్తికర గణాంకాలు వెలువడ్డాయి.2022లో జన్మించిన పిల్లలు.2021లో పుట్టిన పిల్లలతో పోలిస్తే ఏడాది ఆయుర్దాయం పొందినట్లుగా ఫెడరల్ డేటా చెబుతోంది.కోవిడ్ 19 కారణంగా వరుసగా రెండేళ్ల క్షీణత తర్వాత ఈ విషయంలో పురోగతి కనిపిస్తోంది.2022లో నవజాత శిశువులకు ఆయుర్ధాయం 77.5 ఏళ్లు కాగా.ఇది 2021లో 76.4 ఏళ్లుగా వుంది.అయితే 2019లో జన్మించిన వారి కంటే (78.8 సంవత్సరాలు) ఇది తక్కువగా వుండటం ఆందోళనకరంగా వుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.

 Us Life Expectancy Increases But Remains Below Pre-covid Level , Elizabeth Arias-TeluguStop.com

కోవిడ్‌కు( covid ) ముందు అంటే 2019కి ముందు వున్న రోజులు మళ్లీ తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని ఈ నివేదికపై పనిచేసిన సీడీసీ పరిశోధకురాలు ఎలిజబెత్ అరియాస్( Elizabeth Arias ) పేర్కొన్నారు.పిల్లలు పుట్టినప్పుడు మరణాలు సంభవించే పరిస్థితులు జీవితాంతం కొనసాగడం తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆయుర్ధాయాన్ని అంచనా వేశారు.

చుట్టూ సానుకూల ఫలితాలు వున్నాయని దేశంలోని జాతి, లింగాల వారీగా అన్ని సమూహాల ఆయుర్ధాయం పెరిగిందని అరియాస్ అన్నారు.

Telugu Alaskanative, American Indian, Black Hispanic, Elizabeth Arias, Pre Covid

అమెరికన్ ఇండియన్, అలాస్కా నేటివ్ నాన్ హిస్పానిక్ ( American Indian, Alaska Native Non-Hispanic )నవజాత శిశువులకు 2021 స్థాయిల కంటే ఆయుర్ధాయం పెరిగింది.ఆ ఏడాది పుట్టిన నవజాత శిశువుల ఆయుర్ధాయం 65.6 – 67.9 వుండగా.2022లో పుట్టిన హిస్పానిక్ నవజాత శిశువులకు 2.2 ఏళ్ల ఆయుర్ధాయం పెరిగి.అది 77.8 నుంచి 80 సంవత్సరాలకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి.కోవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన బ్లాక్ హిస్పానిక్( Black Hispanic ) కానీ అమెరికన్ల ఆయుర్ధాయం 1.6 సంవత్సరాలు (71.2 ఏళ్ల నుంచి 72.8 ఏళ్లు) పెరిగింది.ఇక ఆసియా నాన్ హిస్పానిక్ శిశువులకు 1 సంవత్సరం , శ్వేతజాతియేతర శిశువులకు 0.8 ఏళ్లు ఆయుర్దాయం పెరిగింది.

Telugu Alaskanative, American Indian, Black Hispanic, Elizabeth Arias, Pre Covid

నివేదిక ప్రకారం అన్ని సమూహాలలో కోవిడ్ కారణంగా ఆయుర్ధాయం క్షీణత 80 శాతం పెరిగింది.గుండె జబ్బులు, అనుకోని గాయాలు, క్యాన్సర్, నరహత్యల కారణంగా మరణాల తగ్గుదల కూడా ఆయుర్ధాయం పెరిగిందేందుకు దోహదపడగా.వాటి ప్రభావం ఎప్పటికప్పుడు మారుతూ వుంటుంది.

అమెరికన్ ఇండియన్, అలాస్కా నేటివ్, హిస్పానిక్ జనాభాకు అనుకోని గాయాలు లేకుంటే వారి ఆయుర్ధాయం ఎక్కువగా వుండేది.సాధారణంగా దేశంలో ఆడవారికి ఆయుర్ధాయం ఎక్కువగా వుంటే.2020లో లింగాల మధ్య వ్యత్యాసం ఆరేళ్లకు పైనే చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube