గెలుపు పై ధీమా ! తగ్గేదేలే అంటున్న మహిళా అభ్యర్థులు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది మహిళలే ఎన్నికల్లో పోటీకి దిగారు.ప్రధాన పార్టీల నుంచే కాకుండా,  స్వతంత్ర అభ్యర్థులగానూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

 List Of Women Candidates Contesting In Telangana Assembly Elections Details, Tel-TeluguStop.com

తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకుంటామనే నమ్మకంతో మహిళ అభ్యర్థులు( Women Candidates ) ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇప్పటికే కొంతమందికి రాజకీయ అనుభవం ఉండగా,  చాలామంది కొత్తవారే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లానే పరిగణలోకి తీసుకుంటే,  12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 215 మంది అభ్యర్థులు పోటీలు నిలిచారు.వారిలో 27 మంది మహిళలు ఉండగా , 188 మంది పురుషులు ఉన్నారు.

Telugu Bade Nagajyothi, Congress, Candis, Indira, Keerthy Reddy, Konda Surekha,

కాంగ్రెస్ బిజెపి నుంచి ఎనిమిది మంది మహిళలు పోటీలో ఉన్నారు.ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క ,( Sithakka ) వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ ,( Konda Surekha ) స్టేషన్ ఘనపూర్ నుంచి సింగపురం ఇందిర,( Singapuram Indira )  పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నారు.బిజెపి నుంచి ముగ్గురు , బీఆర్ఎస్ నుంచి ఒకరు పోటీపడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా బడే నాగజ్యోతి( Bade Nagajyothi ) పోటీ చేస్తున్నారు.

  వరంగల్ బిజెపి అభ్యర్థిగా రావు పద్మ అమరేందర్ రెడ్డి,  భూపాలపల్లి బిజెపి అభ్యర్థిగా కీర్తి రెడ్డి , ( Keerthy Reddy ) డోర్నకల్ అభ్యర్థిగా సంగీత పోటీ చేస్తున్నారు.ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మొత్తం 29 మంది పోటీ చేస్తుండగా,  వీరిలో ఆరుగురు మహిళలు ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి 15 మంది పోటీలో ఉండగా,  వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Telugu Bade Nagajyothi, Congress, Candis, Indira, Keerthy Reddy, Konda Surekha,

పరకాల నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా,  వారంతా పురుషులే.వర్ధన్నపేట నుంచి 14 మంది పోటీ చేస్తుండగా,.  వీరిలో ఇద్దరు మహిళలు.

భూపాలపల్లి నుంచి 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా , వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు .ములుగు నుంచి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా,  వీరిలో ముగ్గురు మహిళలు.  మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 12 మంది పోటీ చేస్తుండగా వీరిలో ఒకరు మాత్రమే మహిళా అభ్యర్థి.అలాగే డోర్నకల్ నుంచి 14 మంది పోటీ చేస్తుండగా,  వీరిలో ఇద్దరు మహిళలు .పాలకుర్తి నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా,  ఇక్కడ ఒక్కరు మాత్రమే మహిళా అభ్యర్థి ఉన్నారు.  స్టేషన్ ఘనాపూర్ నుంచి 19 మంది పోటీ చేస్తుండగా,  వీరిలో ముగ్గురు మహిళలు.

ఈ మహిళల్లో చాలామంది రాజకీయాలకు కొత్త అయినా తప్పకుండా విజయం సాధిస్తామని నమ్ముకంతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,  ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్లను ప్రసంగం చేసుకునే నిమగ్నం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube