బామ్మ స్టైలే వేరు.. చేతిలో టపాసులు పేల్చింది!

భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను( Diwali festival ) అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు.దీంతో పాటు దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

 Grandma's Style Is Different She Burst Tapas In Her Hand, Grandma's Style Is Di-TeluguStop.com

ఢిల్లీతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా పటాకులు కాల్చడంపై నిషేధం ఉంది.అయితే, చాలా రాష్ట్రాలు కొన్ని గంటల పాటు క్రాకర్లు కాల్చడానికి అనుమతించాయి.

అయితే యువకులు కూడా చాలా మంది టపాసులు పేల్చడానికి భయపడతారు.కొంత మంది అయితే వాటి శబ్దాలకు భయపడి ఇంట్లో దాక్కుంటారు.ఇక మహిళలు అయితే చిచ్చుబుడ్డులు, కాకరపువ్వొత్తులు వంటివి వెలిగిస్తూ సంబర పడతారు.అయితే థౌజంట్ వాలా, షాట్స్( Thousand Walla, Shots ) వంటివి పేల్చాలంటే స్వతహాగా మహిళలు భయపడతారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను అవాక్కయ్యేలా చేసింది.ఇందులో ఓ వృద్ధురాలు నిజంగా అద్భుతం చేసింది.పటాకులను చేతిలో పట్టుకుని పేల్చింది.ఆ శబ్దాలకు సమీపంలోని యువకులు కూడా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

అయితే ఆమె మాత్రం ఎలాంటి భయం లేకుండా సంతోషంగా నవ్వుతూ టపాసులు కాల్చింది.

వృద్ధురాలు( old woman ) తన చేతిలో టపాసులు పేల్చుతున్న వీడియోను ద్వైత వాటికా అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.అయితే, ఈ వీడియో ఎప్పుడనేది ధృవీకరించబడలేదు.కానీ దీపావళి సందర్భంగా ఈ వీడియో కనిపించడంతో, ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడుతున్నారు.

అమ్మమ్మ చేతిలో పటాకుల తీగను వెలిగించడం మాత్రమే కాదు, ఆమె కూడా ఆనందించడం చూడవచ్చు.ఈ వయసులో కూడా దీపావళి రోజున బామ్మ పటాకులు పేల్చి ఆనందిస్తోందని అమ్మమ్మ చుట్టుపక్కల వారు చూస్తున్న వీడియోలో మీరు చూడవచ్చు.

వృద్ధురాలికి ఉండే ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.చాలా మంది టపాసులు వెలిగించి అవి తమ మీద పడతాయేమోనన్న భయంతో దూరంగా జరుగుతారు.అయితే అలాంటి భయం ఏ మాత్రం లేకుండా చేతితో టపాసులు పట్టుకుని పేల్చడంతో ఆ వృద్ధురాలి చర్యకు అంతా ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube