ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి( Banana ) ఒకటి.చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో కూడా అరటిపండు ముందు వరుసలో ఉంటుంది.
తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా అరటిపండు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి మెరుగుపరచడానికి సైతం అరటిపండు అద్భుతంగా తోడ్పడుతుంది.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా అరటిపండును వాడితే మస్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్( Skin Care Benefits ) మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
ఆపై పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న అరటిపండు, అవిసె గింజల జెల్ వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ శనగపిండి,( Besan Flour ) హాఫ్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతలకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక ప్రయత్నిస్తే చర్మంపై ఎలాంటి మచ్చలు ఉన్నా క్రమంగా మాయమవుతాయి.స్కిన్ టోన్ పెరుగుతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.
డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.చర్మం ఆరోగ్యంగా మారుతుంది.
సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.కాబట్టి ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా( Spotless Skin ) అందంగా మెరిసిపోవాలని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.