తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు నాగార్జున( Nagarjuna ) ఒకరు.ఈయన నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా డివోషనల్ సినిమాలో కూడా నాగార్జున నటించి ప్రేక్షకులను మెప్పించారు.నాగార్జున నటించిన శ్రీరామదాసు, అన్నమయ్య, శిరిడి సాయి సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి.
నాగార్జున నటించిన డివోషనల్ సినిమాలలో అన్నమయ్య( Annamayya ) మొట్టమొదటిది.ఈ సినిమా ఎలా ప్రేక్షకులను సందడి చేసిందో మనకు తెలిసిందే.
భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున ఎంతో ఒదిగిపోయి నటించారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు పలు విషయాలను వెల్లడించారు.
అన్నమయ్య సినిమా ముందుగా చేయాలని చాలామంది అనుకున్నారు.కానీ ఆ అదృష్టం నాకు మాత్రమే వరించింది.
ఆ దేవుడి ఆశీస్సులు నాపైనే ఉన్నాయనిపించిందని రాఘవేంద్రరావు( Raghavendra Rao ) సంతోషం వ్యక్తం చేశారు.
ఇక సినిమా కథ వినేటప్పుడు నేను కుర్చీలో కూర్చొని కథ వింటున్నాను.అయితే నాకు తెలియకుండానే కింద కూర్చొని ఈ సినిమా కథ వినడం ప్రారంభించామని అంతగా ఈ సినిమా నన్ను ఆకట్టుకుందని రాఘవేంద్రరావు తెలిపారు.కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమాకు ఎవరైతే సరిగ్గా సరిపోతారని ఆలోచించగా నాగార్జున తనకు గుర్తుకు వచ్చారు.
అప్పటికే నాగేశ్వరరావు ఎన్నో డివోషనల్ సినిమాలలో నటించారు.అయితే నాగేశ్వరరావు వారసుడుగా నాగార్జున మాత్రమే ఇలాంటి సినిమాలకు సరిగ్గా సరిపోతారని భావించి నాగార్జునకు ఫోన్ చేసి ఇలా ఒక సినిమా ఉంది కమర్షియల్ గా సినిమా హిట్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ అవార్డు మాత్రం వస్తుంది అని చెప్పాను.
నాగార్జున గారికి చెప్పగానే మరుసటి రోజు వచ్చారు ఆయనకు కథ చెప్పమని ఆత్రేయ గారికి చెప్పి నేను వెళ్లి పక్క రూమ్లో కూర్చున్నాను గంట తర్వాత నాగార్జున నా దగ్గరకు వచ్చారు అయితే ఆయన కళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి.డైరెక్టర్ గారు మీరు ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పారు కానీ ఈ సినిమా అవార్డు అందుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతుందని మనము ఈ సినిమా చేస్తున్నామని చెప్పి వెళ్లారు.
అప్పటికి నాగార్జున మన్మధుడిగా ఒక గ్లామర్ హీరోగా ఎన్నో సినిమాలు చేస్తున్నారు.అలాంటి వ్యక్తితో ఇలాంటి సినిమా హిట్ అవుతుందా అన్న సందేహం కూడా అందరిలోనూ నెలకొంది.అలాగే వెంకటేశ్వర స్వామిగా సుమన్( Suman ) తీసుకోవడం జరిగింది అయితే ఈ సినిమాలో ప్రారంభానికి ముందు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. మీడియా ఎలాంటి ప్రశ్నలు వేసిన ఎలాంటి వార్తలు రాసిన ఎదుర్కోవడానికి సిద్ధమయి ఈ సినిమాని చేసామని అయితే ఈ సినిమాకు నాగార్జున చెప్పిన విధంగా కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా అందుకున్నామంటూ ఈ సందర్భంగా రాఘవేంద్రరావు అన్నమయ్య సినిమా విశేషాలను అందరితో పంచుకున్నారు.