బీజేపీ మేనిఫెస్టో లో ఆ పట్టణాలకు పాత పేర్లు ! అవి ఇవే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) దృష్టి ప్రజలు సెంటిమెంటును రవించేందుకు బిజెపి సెడ్డమైంది ప్రస్తుతం ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అన్నట్లుగా ఉండడంతో బిజెపి కూడా పెంచుతుంది దీనిలో భాగంగానే ప్రజలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుంది.

 The Old Names Of Those Towns In The Bjp Manifesto They Are These , Telangana As-TeluguStop.com

ఈనెల 12 లేదా 13వ తేదీన కొత్త మేనిఫెస్టో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా బిజెపి( BJP ) వర్గాలు పేర్కొన్నాయి.ఈ మేనిఫెస్టోలో ప్రజలు సెంటిమెంటు రగిల్చే విధంగా,  అది బిజెపికి మేలు చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీనిలో భాగంగానే కొన్ని ముఖ్య పట్టణాలకు పాత పేర్లను పెట్టాలని , వాటిని మేనిఫెస్టోలో పొందుపరచాలని బిజెపి నిర్ణయించుకుంది.

Telugu Adilabad, Bjp Menifesto, Congress, Dilipachari, Hyderabad-Politics

దీనిలో భాగంగానే హైదరాబాద్ పేరును భాగ్యనగర్,  నిజామాబాద్ పేరును ఇందూర్, వికారాబాద్ ను గంగవరం గా, కరీంనగర్ ను కరీనగర్ గా, మహబూబ్ నగర్ ను పాలమూరుగా,  ఆదిలాబాద్( Adilabad ) ను ఏదులాపురంగా , మహబూబాబాద్ ను మానుకోట గా పేర్లు మారుస్తూ మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు సమాచారం.పాత పేర్లని ఇప్పుడు ఆయా పట్టణాలకు పెట్టబోతూ ఉండడం తో అది తమకు కలిసి వస్తుందని బిజెపి అంచనా వేస్తోంది.ఇక నేడు బిజెపి నాలుగో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది .23 మంది అభ్యర్థులతో తుది జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.ఇప్పటికే బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పొత్తులో భాగంగా 8 సీట్లను జనసేనకు కేటాయించనున్నారు.

జనసేన( Janasena )కు కేటాయించిన నియోజకవర్గాల్లో బిజెపి క్యాడర్  నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించే విషయం పైన దృష్టి సారించారు.

Telugu Adilabad, Bjp Menifesto, Congress, Dilipachari, Hyderabad-Politics

 ముఖ్యంగా బిజెపి నేత దిలీపాచారి( Dilipachari ) నాగర్ కర్నూల్ సీటుపై అధిష్టానం పై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారట.అలాగే సేరి లింగంపల్లి సీటుపైనా సస్పెన్స్ కొనసాగుతోంది.ఇది ఎలా ఉంటే జనసేన తో పొత్తు పై బిజెపి క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆ పార్టీ అధిష్టానం మాత్రం జనసేనతో పొత్తు తమకు కలిసి వస్తుంది అనే అంచనాలోనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube