పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )హీరోగా, నేహా ఒబెరాయ్( Neha Oberoi ) హీరోయిన్ గా క్రైమ్ యాక్షన్ ఫిలిం బాలు: ఏబీసీడీఈఫీసీ 2005లో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా చేసేటప్పుడు పవన్ రేణు దేశాయ్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.2000లోనే బద్రి సినిమాతో పవన్, రేణు దేశాయ్‌ల మధ్య ప్రేమ చిగురించింది.తర్వాత రేణు పవన్ కళ్యాణ్ నటించే సినిమాల క్యాస్టింగ్ విషయాల గురించి కూడా తెలుసుకునేది.
కానీ తాను చెప్పిన నటినే హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయాలని ఆమె ఎన్నడూ ఏ దర్శకుడిని అడగలేదట.అయితే బాలు సినిమా దర్శకుడు కరుణాకరన్ మాత్రం రేణు దేశాయ్‌కు “బాలు” సినిమా క్యాస్టింగ్ గురించి ముందే చెప్పాడట.
తనకు దర్శకుడు కరుణాకరన్ చాలా క్లోజ్ అని రేణు దేశాయ్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది.
అక్క అక్క అని పిలుస్తూ బాలు సినిమా క్యాస్టింగ్ గురించి తనకు చెప్పాడని ఆమె వెల్లడించింది.రేణు మాట్లాడుతూ.“‘అక్క, ఒక మంచి సినిమా దొరికింది, ఒక మంచి యాక్టర్ దొరికింది.హీరోయిన్ మాత్రం ఐశ్వర్య రాయ్ లవర్ లో ఉంటుంది’ అని అన్నాడు.దాంతో నాకు కొంచెం టెన్షన్‌గా అనిపించింది.మిస్ వరల్డ్ ఐశ్వర్య లాంటి అమ్మాయి పవన్ పక్కన నటిస్తుందంటే అది ఎలా ఉంటుందో అని టెన్షన్ పుట్టింది.తర్వాత నేను ఆ ఫొటో చూశాక ఆమె ఐశ్వర్య రాయ్ అంత అందంగా లేదనిపించింది.
బానే ఉన్నా, మరీ ఆ లెవెల్‌లో అందంగా ఉంటుందని కరుణాకర్( Karunakar ) ఎక్కువ చేసి చెప్పాడు.ఆ సమయంలో చాలా క్యూరియాసిటీ పెరిగింది.ఫొటో చూశాక అదంతా పోయింది.” అని చెప్పుకొచ్చింది.
రేణు ఇంకా మాట్లాడుతూ.“సినిమా అయిపోయాక బాలు హీరోయిన్ రేణు దేశాయ్ బంధువట, ఆమె పట్టుబట్టి మరీ ఈ అమ్మాయినే తీసుకోవాలని దర్శకుడితో గొడవ పెట్టుకుందట.అందుకే ఆమెను తీసుకోవాల్సి వచ్చిందనే టాక్ వచ్చింది.అది విని నేను షాక్ అయ్యాను.అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు.ఫొటోలో చూడటమే మొదటిసారి కానీ ఇలా ప్రచారం మొదలుపెట్టి నాకు షాక్ ఇచ్చారు.” అని తెలిపింది.క్యాస్టింగ్ విషయంలో తాను ఎప్పుడూ వేలు పెట్టలేదని, డైరెక్టర్ రాసుకున్న కథకు తగినట్లు ఆయనే నటీనటులను తీసుకుంటారని, ఆ విషయంలో ఎవరూ కూడా కలగజేసుకోకూడదని ఆమె పేర్కొంది.