బ్రహ్మానందం( Brahmanandam ) ఎంత గొప్ప నటుడో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఏ సన్నివేశంలో ఎలాంటి హావభావాలతో ఎలా నటించాలో బ్రహ్మానందానికి బాగా తెలుసు.
ప్రేక్షకులను ఏడిపించడం నుంచి నవ్వించడం వరకు తనకు తానే సాటి.వయసు పై పడ్డాక కూడా బ్రహ్మానందం అద్భుతమైన నటన చాతుర్యంతో బాగా ఆకట్టుకుంటున్నాడు.
దానికి ఉదాహరణే రంగమార్తాండ సినిమా.బ్రహ్మానందంలో ఇంత మంచి నటుడు ఉన్నాడని సంగతి మొన్నటి దాకా ఎవరికీ తెలియ రాలేదు.
ఎందుకంటే దర్శక నిర్మాతలు బ్రహ్మానందం చేత గత దశాబ్ద కాలంగా ఒకే రోల్ చేయించారు.ఆ మొనాటనీ వల్ల బ్రహ్మానందం కామెడీ రొటీన్ అయిపోయింది.
ప్రేక్షకులు పెద్దగా బ్రహ్మీ కామెడీ నచ్చకపోవడంతో వెన్నెల కిషోర్ లాంటి వారిని దర్శకనిర్మాతలు తీసుకోవడం మొదలుపెట్టారు.అలా మెల్లిమెల్లిగా దర్శకులు బ్రహ్మికి సినిమా అవకాశాలు ఇవ్వడమే మానేశారు.ఈ నవ్వుల రారాజుకు కూడా కామెడీ క్యారెక్టర్స్ పై బోర్ కొట్టినట్టు ఉంది.అందుకే డిఫరెంట్ రోల్స్ చేయడానికి మొగ్గు చెబుతున్నాడు.రీసెంట్గా విడుదలైన కీడాకోలా సినిమాలో( Keedaa Cola ) వీల్ చెయిర్కు పరిమితమైన ఒక వేషం వేశాడు.ఈ ఫుల్ లెంత్ పాత్ర సినిమాలో కొంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
ఈ పాత్ర బ్రహ్మానందం అంతటి గొప్ప నటుడు చేయాల్సిన పనిలేదు.ఈ మధ్యన వచ్చిన చిన్న కమెడియన్ కూడా చేయగలడు కానీ తరుణ్ భాస్కర్( Tharun Bhascke ) బ్రహ్మి మీద అభిమానంతో సెలెక్ట్ చేసి ఉండవచ్చు.
అయినను ఎలాంటి నటనను డిమాండ్ చేయని అలాంటి పాత్రలో బ్రహ్మానందం చేయడమే ఆశ్చర్యంగా ఉందని చాలామంది సినిమా చూసినవారు కామెంట్లు చేస్తున్నారు.బ్రహ్మానందం ఈ మూవీలో ఉన్నాడని తెలిసి చాలామంది సినిమా థియేటర్లకు క్యూ కట్టారు.రంగమార్తాండా( Rangamartanda ) లాంటి పర్ఫామెన్స్ బ్రహ్మానందం నుంచి ఎక్స్పెక్ట్ చేశారు కానీ వారందరికీ నిరాశ ఎదురయింది.అతడి పాత్ర కూరలో కరేపాకు లాంటిది.అది లేకపోతే బాగుండదు.కానీ ఓవరాల్ రుచికి దాని భూమిక చాలా చిన్నది.
అలాగే బ్రహ్మి పాత్ర కూడా ఇందులో ఒక కరేపాకు లాంటిది.ఆ పాత్ర లిమిటెడ్ స్క్రీన్ టైమ్ తో వస్తుంది.
ఇలాంటి క్యారెక్టర్ బ్రహ్మానందం ఒప్పుకోవడం వల్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా భవిష్యత్తులో అభిమానులను నిరాశపరచకుండా బ్రహ్మీ మంచి రోజు ఎంచుకోవడం బెటర్.