తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని అసంతృప్త నేతలను బీఆర్ఎస్ ఆకర్షిస్తుంది.
ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి మంత్రి హరీశ్ రావు వెళ్లనున్నారు.విష్ణును బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే నిన్న రాత్రి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను విష్ణు కలిసిన సంగతి తెలిసిందే.కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయన సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
అయితే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారా? లేదా? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.