తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా కాంగ్రెస్ కు షాక్ తగిలింది.ఆ పార్టీకి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నాగం జనార్థన్ రెడ్డి సీట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాగర్ కర్నూల్ స్థానం నుంచి అభ్యర్థిగా రాజేశ్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ ను వీడినట్లు సమాచారం.మరోవైపు ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు నాగం జనార్థన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు నాగంను బీఆర్ఎస్ లోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించనున్నారు.