గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదు - కవ్వంపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణను డప్పు చప్పుల్లు కోలాటలతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం మహిళలు, గ్రామ ప్రజలు పలికినారు.

 No Fear Of Threats From Brs Leaders In Villages Kavwampally, Brs Leaders , Kavw-TeluguStop.com

ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు.గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అడ్డగోలుగా దోచుకున్నారనీ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు చెక్కు చేదరకుండా ఉన్నాయని బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లు కింద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం వారి నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనం అన్నారు.

ఎన్నికల ముందు ఓట్లు దండుకోవడానికి బీసీ బందు, దళిత బందు, గృహలక్ష్మి పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తున్న బిఆర్ఎస్ నాయకులకు బుద్ది చెప్పాలన్నారు.మానకొండూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కంటే ఇక్కడ రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎక్కువ అభివృద్ధి చెందాడని అన్నారు.

గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికార పార్టీ నాయకులను వారికి సహాకరిస్తున్న అధికారులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.అనంతరం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కుల సంఘాల నాయకులు కవ్వంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇట్టి కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube