వచ్చే నెలలో తెలంగాణ వ్యాప్తంగా జరగబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యడానికి రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి.ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ వాతావరణం నెలకొంది.
కొన్ని సర్వేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ( BRS ) అధికారం లోకి వస్తుంది అని అంటుంటే, కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గెలుస్తుందని అంటున్నారు.అయితే ఏ పార్టీ గెలిచినా సంపూర్ణ మెజారిటీ తో ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించడం లేదు.
ఇక పోతే ఆంధ్ర ప్రధాన పార్టీలు వైసీపీ మరియు టీడీపీ ఈ ఎన్నికలకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నాయి.టీడీపీ పార్టీ( TDP ) ముందుగా పోటీ చెయ్యాలను అనుకుంది కానీ, పరిస్థితులు కలిసొచ్చే లాగ లేకపోవడం తో ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది పార్టీ అధిష్టానం.
పార్టీ స్థాపించిన ఈ నాలుగు దశాబ్దాలలో తెలుగు దేశం పార్టీ తెలంగాణ లో పోటీ చెయ్యకుండా ఉన్నది ఈ ఎన్నికలలోనే.
2014 వ సంవత్సరం లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి 20 కి పైగా స్థానాల్లో గెలుపొందింది.అలాగే 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగిన టీడీపీ కి కేవలం 3 స్థానాలు మాత్రమే వచ్చాయి.అయితే ఈసారి పూర్తిగా ఎన్నికల నుండి వైదొలగడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకి గురి చేస్తున్న విషయం.మరోపక్క కొత్త పార్టీ గా పిలవబడే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ కూడా తెలంగాణ లో పోటీ చెయ్యడానికి సిద్ధమైంది.34 స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేయబోతున్నట్టు ముందుగా అధికారిక ప్రకటన చేసారు.కానీ మధ్యలో బీజేపీ పార్టీ ముఖ్య నేత కిషన్ రెడ్డి( Kishan Reddy ) పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి కలిసి పోటీ చేద్దామనే నిర్ణయానికి వచ్చారు.కానీ దీని గురించి మళ్ళీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 34 స్థానాలు అడిగితే బీజేపీ కేవలం 12 స్థానాలు మాత్రమే ఇస్తామని చెప్పారట.దీంతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని పోదామా, లేదా సొంతగా పోటీ చేద్దామా అని పునరాలోచనలో పడినట్టు సమాచారం.మరోపక్క తెలుగు దేశం పార్టీ పోటీ నుండి తప్పుకొని జనసేన పార్టీ కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపింది.మరి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడా, లేదా పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాడా అనేది నవంబర్ 1 వ తేదీన తెలియనుంది.