Rithu Chowdary : వాడి వల్ల చాలా మోసపోయాను.. కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ నటి?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ నటి రీతూ చౌదరి( Jabardasth Rithu Chowdary ) సుపరిచితమే.మొదట సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.

 Rithu Chowdary Emotional New House Work-TeluguStop.com

జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో చేయడంతో పాటుగా జబర్దస్త్ కమెడియన్ అజర్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కొద్దిరోజులు వార్తలు వినిపించాయి.ఆ సమయంలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది రీతూ చౌదరి.

ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) షో కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.ఇది ఇలా ఉంటే ఇటీవల రీతూ చౌదరి తండ్రి మరణించిన విషయం తెలిసిందే.

Telugu Jabardasthrithu, Rithu Chowdary, Rithuchowdary, Tollywood-Movie

ఇక అప్పటినుంచి తరచూ తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉంది రీతూ చౌదరి.ఇది ఇలా ఉంటే తాజాగా తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఒక ఇంటీరియర్‌ డిజైనర్‌( Interior Design ) వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా రీతూ చౌదరి మాట్లాడుతూ.మా ఫ్యామిలీకి నాన్న దూరం కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఆయన లేకపోవడంలో నా కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియల్‌ వర్క్‌ను ఒకరికి అప్పజెప్పాను.అందుకు గాను అతనికి రూ.5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను.కానీ అతను డబ్బు తీసుకున్నాక పని మాత్రం నేను చెబుతున్నట్లుగా చేయలేకపోయాడు.

Telugu Jabardasthrithu, Rithu Chowdary, Rithuchowdary, Tollywood-Movie

పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడు.దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే ఎటువంటి రెస్పాన్స్‌ లేకుండా ఫోన్లకు కూడా స్పందించేవాడు కాదు.తిరిగి మమ్మల్నే అనరాని మాటలు అనేవాడు.చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడు.అలా ఒక వైపు బ్యాంక్‌ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమయ్యాను.

ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోవడం( Rithu Chowdary Father Death )తో నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.ఈ ఇల్లు నిర్మాణ విషయంలో నేను తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురికావడమే కాకుండా ఆర్థికంగా మోసపోయాను.

ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.

Telugu Jabardasthrithu, Rithu Chowdary, Rithuchowdary, Tollywood-Movie

అయితే అతన్ని పనిలో నుంచి తొలగించాక ఇంటీరియర్‌ వర్క్‌ను వేరే వాళ్లకు అప్పగించాను.ప్రస్తుతం వర్క్‌ పూర్తి కావచ్చింది.నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్‌ చేస్తున్నాను అంటూ రీతూ చౌదరి తెలిపింది.

రీతూ చౌదరి ప్రస్తుతం ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే అతనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆ మధ్య వాళ్ళిద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ రూమర్సే అంటూ ఇటీవల ఒక ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube