మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

గోర్లు పొడుగ్గా ఉంటే చేతులు అందంగా, అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాయి.అందుకే చాలా మంది అమ్మాయిలు పొడవాటి గోర్లను కోరుకుంటూ ఉంటారు.

 If You Follow These Tips Your Nails Will Grow Long And Strong , Long Nails,-TeluguStop.com

అయితే కొందరికి నెయిల్స్ గ్రోత్( Nail growth ) అనేది సరిగ్గా ఉండదు.ఈ క్ర‌మంలోనే వేలకు వేలు ఖర్చుపెట్టి కృత్రిమ నెయిల్స్( Artificial nails ) ను అతికించుకుంటూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే.ఈ చిట్కాలను పాటిస్తే సహజంగానే మీ గోర్లు పొడుగ్గా, దృఢంగా పెరుగుతాయి.మరి లేటెందుకు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Healthy Nails, Latest, Long Nails, Nail Tips, Nails-Telugu Health

సాధారణంగా గుడ్డు పెంకులు( Eggshells ) ఎందుకో పనికి రావని డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటాం.కానీ వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా గుడ్డు పెంకుల్లో ఉండే క్యాల్షియం నెయిల్స్ గ్రోత్ ను పెంచడానికి సహాయపడతాయి.కొన్ని గుడ్డు పెంకులను తీసుకుని బాగా ఎండబెట్టి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గుడ్డు పెంకుల పొడిలో రెండు స్పూన్లు ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని గోర్లకు పట్టించి అరగంట పాటు వదిలేయాలి.

అనంతరం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే చాలా వేగంగా పొడవాటి బలమైన గోర్లు మీ సొంతం అవుతాయి.

Telugu Tips, Healthy Nails, Latest, Long Nails, Nail Tips, Nails-Telugu Health

నెయిల్స్ గ్రోత్ ను పెంచడానికి విటమిన్ సి కూడా సహాయపడుతుంది.విటమిన్ సి లెమన్ జ్యూస్( Lemon juice ) లో మెండుగా ఉంటుంది.అయితే లెమన్ జ్యూస్ ను నేరుగా కాకుండా.ఆలివ్ ఆయిల్ ( Olive oil )క‌లిపి అప్లై చేయండి.వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని లైట్ గా హీట్ చేసి గోర్లకు అప్లై చేసుకోవాలి.ఆపై బాగా మసాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ చిట్కాను పాటిస్తే.మీ నెయిల్స్ అద్భుతంగా పెరుగుతాయి.

ఇక ఈ చిట్కాలతో పాటు డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోండి.

ఇవి నెయిల్స్ గ్రోత్ ను పెంచడానికి చక్కగా స‌హాయ‌పడతాయి.అందమైన దృఢమైన పొడవాటి గోర్లు మీ సొంతం అయ్యేలా చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube