ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఉమ్మడిగా రెండు పార్టీలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని రెండు రోజుల క్రితం రాజమండ్రిలో సమన్వయ భేటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రెండు పార్టీలు కలిసి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు.
రాబోయే రోజుల్లో వైసీపీ( YCP ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమాలు , ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు.అలాగే రెండు పార్టీల నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఒక కమిటీని కూడా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేశారు.

ఇక ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన చర్చించారు.ఇదిలా ఉంటే మరోసారి జనసేన, టిడిపి సమన్వయం కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నవంబర్ 3 విజయవాడ( Vijayawada )లో మరోసారి టిడిపి, జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు.ఈ సందర్భంగా రెండు పార్టీలు ఉమ్మడిగా ఇంటింటా ప్రచారం చేయడం పైన కేడర్ కు దిశ నిర్దేశం చేయనున్నారు.
అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొందించి వైసిపి పోవాలి టిడిపి జనసేన రావాలి అనే నిదానంగా ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ , నారా లోకేష్( Pawan Kalyan, Nara Lokesh ) సంయుక్తంగా దీనిపై ప్రకటన చేయమన్నారు. ఇక నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇకపై ఏ కార్యక్రమమైనా రెండు పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేసే విధంగా ప్రణాలికను సిద్ధం చేస్తున్నారు .ఈ మేరకు విజయవాడలో జరిగే టీడీపీ , జనసేన ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.ఇప్పటికే మొదటి విడత సమన్వయ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మేరకు నవంబర్ 1 నుంచి ఇంటింటికి ప్రచారం చేపట్టనున్నారు.
ప్రజా సమస్యల పోరులో భాగంగా ఏపీలో కరువు పరిస్థితులు పై ప్రాంతాలవారీగా నివేదికలు తయారు చేయబోతున్నారు.ఏపీలో ఓట్ల తొలగింపు తో సహా ప్రతి సమస్య పైన పోరాటం చేపట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు .