అవసరం అనేది మనిషికి కొత్త విషయాలు నేర్పించడమే కాదు, కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగేలా చేయిస్తుంది.ఈ మధ్య కాలంలో చాలామంది అవసరాన్ని బట్టి కొత్త కొత్త వస్తువులను కనుగొన్న ఘటనలు గురించి మనం తెలుసుకుంటున్నాం.
దీనికోసం ఆయా వ్యక్తులు ఎక్కడికో వెళ్ళడం లేదు.తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుతాలు చేస్తున్నారు.
ఫలితంగా కష్టపడి చేయాల్సిన పని చాలా సులువుగా మారిపోతుంది.కాగా సోషల్ మీడియా( Soical Media ) అందుబాటులోకి వచ్చాక ఇలాంటి నూతన ఆవిష్కరణలకు సంబధించి చాలా వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.
ఈ నేపధ్యంలోనే గోధుమలు శుభ్రం చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయోగం, అతని ఆవిష్కరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోధుమలు( Wheat ) ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసినదే.చాలామంది ఆరోగ్య స్పహతో వారికి బదులు గోధుమలు తెచ్చుకుని వాటిని శుభ్రపరిచి, మరపట్టించి పిండి వాడుకుంటారు.అయితే గోధుమలు, రాగులు, జొన్నలు వంటి తృణధాన్యాలను శుభ్రం చేయడం అనేది ఒకింత కష్టంతో కూడుకున్న విషయం అని అందరికీ తెలిసినదే.
వెదురు జల్లెడలో వేసి తిప్పడం నుండి, ఆ తరువాత తూరుపు పట్టడం ద్వారా ధాన్యాలు శుభ్రం చేస్తుంటారు.పల్లె ప్రాంతాలలో పెద్ద మొత్తంలో ధాన్యం శుభ్రం చేయడానికి గాలికి వ్యతిరేక దిశలో ధాన్యాన్ని ఎత్తు పోస్తారు.
దీనినే తూర్పు పట్టడం అంటారు.సరిగ్గా అదే పద్దతిని వినూత్నంగా ఉపయోగించారు ఇక్కడ.
అవును, ఇక్కడ వీడియోలో ఒక పొడవాటి ప్లాస్టిక్ టేబుల్( Plastic Table ) వుండడం గమనించవచ్చు.ఆ టెబుల్ ఉపరితల భాగానికి నాలుగు వైపులా నాలుగు చిన్న రంధ్రాలు వుండడం చూడవచ్చు.ఈ నాలుగు రంధ్రాలలో మూడింటిని ప్లాస్టర్ తో క్లోజ్ చేయగా మిగిలిన రంధ్రాన్ని అలాగే ఉంచేశారు.ఒక కూలర్ పైన ప్లాస్టిక్ టేబుల్ ను తిప్పేసి ఓపెన్ రంధ్రం ముందు ఉండేలా పెట్టారు.
టేబుల్ లో గోధుమలు పోయగానే అవి ముందు రంధ్రంలో నుండి మెల్లగా కిందకు పడుతున్నాయి.ఈ ప్రాసెస్ లో కూలర్ గాలికి గోధుమలలో ఉన్న దుమ్ము, ధూళి దూరంగా ఎగిరిపోతోంది.
దీని సహాయంతో గోధుమలు మాత్రమే కాకుండా చాలా రకాల ధాన్యాలు ఇలాగే శుభ్రం చేసుకోవచ్చు.ఈ వీడియోను చూసినవారు ఫిదా అయిపోతున్నారు.ఈ ఐడియా రైతులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు.