వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్న కార్లు కోసం చూస్తున్నారా? అత్యంత తక్కువ ధరలలో ఇవే?

మారుతున్న కాలంతో పాటు జనాల మైండ్ సెట్ కూడా బాగా మారుతోంది.ఇపుడు వారు, వీరు అనే తేడా లేకుండా కార్లు( Cars ) కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

 These Cars With Wireless Phone Charging Under Ten Lakhs Details, Cars ,wireless-TeluguStop.com

గత ఇదేళ్లతో పోల్చుకుంటే ఇపుడు మరీ ఎక్కువగా వుంది.దానికి కారణం ఒక్కటే.

సౌకర్యవంతమైన ప్రయాణం. అవును, ఒకప్పుడు మాదిరి జనాలు ఇపుడు ఇబ్బందులు పడి, వ్యయ ప్రయాసలు కొర్చి ప్రయాణాలు సాగించాలని అనుకోవడం లేదు.

తమ కుటుంబంతో ఎక్కడికన్నా సుదూరాలు వెళ్లాలంటే కార్లనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలోనే వారి వారి బడ్జెట్లో మంచి ఫీచర్లు కలిగిన కార్లు కొంటున్నారు.

ఇక ఈ రోజుల్లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్( Wireless Phone Charging ) అనేది కార్లలో ప్రముఖ ఫీచర్‌గా మారింది.

Telugu Cars, Hyundai Aura, Hyundai Exter, Hyundai, Wireless Phone, Wirelessphone

ఎందుకంటే ఈ ఫీచర్ మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి కేబుల్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు.అవును, ఇక్కడ కేబుల్ లేకుండా ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు.దీని కోసం, క్యాబిన్‌లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది ఇవ్వబడుతుంది.

అయితే దీని కోసం మీ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి.కాగా వైర్‌లెస్ ఛార్జింగ్‌తో రూ.10 లక్షల లోపు వచ్చే కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Cars, Hyundai Aura, Hyundai Exter, Hyundai, Wireless Phone, Wirelessphone

ఇక్కడ మొదటగా “హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్”( Hyundai Grand i10 Nios ) మోడల్ గురించి తెలుసుకోవాలి.ఇది సెకండ్-టు-టాప్ స్పోర్ట్జ్ ట్రిమ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి వుంది.కాగా దీని వేరియంట్ ధర రూ.7.56 లక్షలుగా వుంది.ఆ తరువాత “హ్యుందాయ్ ఆరా”( Hyundai Aura ) గురించి చెప్పుకోవాలి.వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ను అందించే దీని ధర రూ.10 లక్షల కంటే తక్కువ.దీని SX(O) ధర రూ.8.61 లక్షలు కాగా, SX+ AMT ధర రూ.8.85 లక్షలు.అదేవిధంగా “హ్యుందాయ్ ఎక్స్‌ టర్”( Hyundai Exter ) విషయానికొస్తే… వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ను అందించే ఏకైక మైక్రో SUV హ్యుందాయ్ ఎక్సెంట్( Hyundai Xcent ) అని చెప్పుకోవచ్చు.దీని ధర రూ.9.43 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube