ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.వైసీపీ పార్టీ( YCP )కి చెందిన చాలామంది నాయకులు ఇతర పార్టీలలోకి జాయిన్ అవుతున్నారు.
ముఖ్యంగా జనసేన పార్టీలోకి జాయిన్ అవటానికి క్యూ కడుతున్నారు.అక్టోబర్ 19 వ తారీకు ఉదయం రాజోలు నియోజకవర్గం చాలామంది వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జాయిన్ కావడం జరిగింది.
సాయంత్రం వైసీపీ సీనియర్ నేత వర్ధనపు ప్రసాద్( YCP Senior Leader Vardhanapu Prasad ) జనసేనలో జాయిన్ అవుతున్నట్లు నరసాపురంలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో స్పష్టం చేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ ఆశయాలుకు అనుగుణంగా పనిచేస్తానని వర్ధనపు ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో జనసేన నరసాపురం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్( Bommidi nayakar ) తో కలిసి నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వటానికి 50 కారులలో బయలుదేరడం జరిగింది.రెండు గోదావరి జిల్లాలలో భారీ ఎత్తున జనసేన( Janasena )లో జాయిన్ అవ్వడానికి వివిధ పార్టీల రాజకీయ నేతలు సిద్ధమవుతున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఐదు ఆరు నెలలు మాత్రమే ఉండటంతో.పరిస్థితులు మొత్తం తారుమారవుతున్నాయి.
ఉభయగోదావరి జిల్లాలలో చాలామంది నాయకులు జనసేనలో జాయిన్ అవ్వటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు.పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి విజయయాత్ర( Varahi Vijaya yatra ) తర్వాత జనసేన పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది.
దీంతో చాలామంది నాయకులు జనసేనలో చేరటానికి ఇష్టపడుతున్నారు.