ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య జనవరి 20న అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.తనదైన నిర్ణయాలతో అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించారు.
పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి దేశాన్ని వణికిస్తున్న కరోనాపై పోరుకు దిగిన బైడెన్.పకడ్బందీ చర్యలతో అమెరికా( America )ను వైరస్ గండం నుంచి గట్టెక్కించగలిగారు.
వ్యాక్సినేషన్‌ను పెద్ద ఎత్తున చేపట్టి జూలై 4న స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు కరోనా విముక్తి దినం పేరిట ఉత్సవాలను సైతం జరిపించారు.ఇక ట్రంప్ కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ అమెరికన్లకు ఆశాదీపంలా మారారు.
కానీ గత కొంతకాలంగా బైడెన్ తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికా ఆర్ధిక, దౌత్య విధానాలు, ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, ఆర్ధిక మాంద్యం , పెరుగుతున్న చైనా ప్రాబల్యం వంటి విషయాలను బైడెన్( Joe Biden ) సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు.ఇక ఇటీవల షట్‌డౌన్ అంశం బైడెన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.అప్పటి స్పీకర్ మెక్‌కార్ధీ చొరవ తీసుకోని పక్షంలో అమెరికా పరిపాలనా యంత్రాంగం పడకేసేది.
ఈ కారణాలతో జో బైడెన్ ప్రజాదరణ తగ్గుతున్నట్లు కొత్త పోల్ వెల్లడించింది.బుధవారం విడుదల చేసిన సీఎన్‌బీసీ సర్వేలో 58 శాతం మంది అమెరికన్లు .బైడెన్ దేశాన్ని నడుపుతున్న విధానంపై పెదవి విరిచారు.బైడెన్ ఆర్ధిక విధానంపై 32 శాతం, విదేశాంగ విధానంపై 31 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు.
చివరికి బైడెన్ సొంత పార్టీ కూడా ఆయనపై నమ్మకం కోల్పోతోంది.డెమొక్రాట్‌లలో 66 శాతం మంది మాత్రమే ఆయన విదేశాంగ విధానానికి మద్ధతు ఇస్తుండగా.74 శాతం మంది అతని ఆర్ధిక విధానాలను ఆమోదించారు.ఈ సంఖ్యలు డెమొక్రాట్లలో బైడెన్ మొత్తం అప్రూవల్ రేటింగ్ (81 శాతం) కంటే తక్కువ.
మరోసారి అధ్యక్ష బరిలో నిలిచిన జో బైడెన్‌ను ఇవి బాధపెట్టే సంఖ్యలని రిపబ్లికన్ పోల్‌స్టర్ మికా రాబర్ట్స్ సీఎన్‌బీసీతో అన్నారు. డెమొక్రాటిక్ పోల్‌స్టర్ జే కాంప్‌బెల్( Democratic pollster Jay Campbell ) మాట్లాడుతూ.
యువ ఓటర్లు, నల్ల జాతీయులు, లాటిన్ జాతీయులలో బైడెన్ రేటింగ్‌లు చాలా ఇబ్బందికరంగా వున్నాయని పేర్కొన్నారు.అంతేకాదు.ట్రంప్, బైడెన్‌ల( Donald Trump vs Joe Biden ) మధ్య పోటీ జరిగితే బైడెన్ 4 పాయింట్ల తేడాతో ఓడిపోతారని పోల్ అంచనా వేసింది.ట్రంప్‌కు 46 శాతం ఓట్లు వస్తే.
బైడెన్‌కు 42 శాతం ఓట్లు పోలవుతాయని తెలిపింది.

అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్( Israel War ) యుద్ధం ప్రకటించిన తర్వాత ఈ పోల్ నిర్వహించారు.ఇందులో దాదాపు 74 శాతం మంది అమెరికన్లు ఇజ్రాయెల్‌కు యూఎస్ సైనిక సాయం అందించాలని అభిప్రాయపడ్డారు.39 శాతం మంది ఇజ్రాయెల్‌కు అమెరికా అనుకూలంగా వుండాలని కోరుకుంటే.6 శాతం మంది పాలస్తీనాను సమర్ధించారు.36 శాతం మంది అమెరికా ఈ విషయంలో తటస్ధంగా వుండాలని కోరారు.