ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ భేటీ అయింది.ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మధు యాష్కీ హాజరయ్యారు.

 Congress Central Election Committee Meeting In Delhi-TeluguStop.com

ఈ సమావేశంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సీఈసీ పరిశీలించనుంది.అనంతరం అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది.

ఈ నేపథ్యంలోనే ఈనెల 15 తరువాత ఏఐసీసీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.కాగా గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు మరియు స్థానిక పరిస్థితులు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube